వివేకా హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్.. సుప్రీంకు విన్నవించిన సీబీఐ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-05 06:28:40  IST  )

మాజీమంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసకుంది.

వివేకా హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్.. సుప్రీంకు విన్నవించిన సీబీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీమంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసకుంది. ఈ మేరకు కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిందని సీబీఐ తరఫు న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)కు తెలిపారు. అందుకు సంబంధించి పూర్తి నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు. ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణనను కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై మరికొద్దినేపట్లో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇటీవలే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ (CBI) అభిప్రాయం తెలపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం కోరిన విషయం తెలిసిందే. వారి ఒపినియన్ చెప్పిన తరువాతే వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి (MP Avinash Reddy) బెయిల్‌ రద్దుపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా..లేదో చెబితేనే కేసు కొలిక్కి రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై కూడా సీబీఐ ఒపీనియన్ చెప్పాల్సి ఉంది. ఇక కేసు ట్రయల్‌, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా.. లేదా అనే అంశంపై సీబీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

కాగా, వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy), సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను ఇప్పటికే పలుమార్లు జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ ధర్మాసనం విచారించింది. వాదానల సందర్భంగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో పాటు బెయిల్‌పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీతా రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. CBI అధికారి రామ్‌సింగ్‌తో పాటు సునీతా రెడ్డి దంపతులపై దాఖలైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనానికి విన్నవించారు. ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story