- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viveka Case: గంగిరెడ్డికి బెయిల్ మంజూరు
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డికి బెయిల్ మంజూరు అయింది....

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో ఏ1 నిందితుడు గంగిరెడ్డి(Accused Gangireddy)కి బెయిల్ మంజూరు అయింది. తనకు బెయిల్(Bail) మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు(Supreme Court)లో శుక్రవారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానందారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గంగిరెడ్డిని ఏ1 నిందితుడిగా పోలీసులు గుర్తించారు. గంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే పులివెందుల కోర్టు ఇచ్చిన తీర్పుతో గంగిరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సీబీఐ అధికారులు కడపతో పాటు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టులు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేశాయి.
అయితే ఆ తర్వాత ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. దీంతోనూ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కోర్టు కూడా గంగిరెడ్డి బెయిల్ రద్దూ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గంగిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఆయా సమయాల్లో విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఇరువర్గాల వాదన విన్న కోర్టు.. గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుప్రీంకోర్టులో గంగిరెడ్డికి ఊరట లభించింది.






