- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ వ్యక్తి కావాలని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 20 సీట్లు డిమాండ్ చేస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని.. బీజేపీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరినో తమ భుజాలపైకి ఎక్కించుకునే పని తమది కాదని పేర్కొన్నారు. 2014లో మాదిరిగా కాదని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీపై తమకు అధికారిక సమాచారం లేదని తెలిపారు. బీజేపీ నాయకుడే సీఎం కావాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వేరే పార్టీలను సీఎం చేయడానికి బీజేపీ పని చేయదని స్పష్టం చేశారు. బీజేపీ బలహీనంగా ఉంటే పొత్తు కోసం ఎందుకు పాకులాడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story






