- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishnu Kumar Raju: విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ.. విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)పై కార్మికుల రాద్ధాతం సరికాదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (MLA Vishnu Kumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)పై కార్మికుల రాద్ధాతం సరికాదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (MLA Vishnu Kumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. శాశ్వత పరిష్కారంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)కు కేంద్రం పెద్ద ఆర్ధిక ప్యాకేజీని ఇచ్చిందని కామెంట్ చేశారు. కార్మికులు ఆందళనలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. 2300 మంది కాంట్రాక్ట్ కార్మికుల (Contract Workers) తొలగింపు విషయంలో నిర్ణయం మేనేజ్‌మెంట్ చూసుకుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Mister Narendra Modi), కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంటుందని విష్ణు కుమార్ రాజు అన్నారు. అనంతరం నారా లోకేశ్ (Nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఎవరి అభిప్రాయాలు వారివి అని విష్ణు కుమార్ రాజు అన్నారు.






