- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vizag Steel Plant | రేషనలైజేషన్ సర్క్యూలర్ పై కార్మిక సంఘాల ఆగ్రహం
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యూలర్ వివాదానికి కారణమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యూలర్ వివాదానికి కారణమవుతోంది. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామని అందులో యాజమాన్యం పేర్కొన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దాని వల్ల కార్మికులు (Workers) నష్టపోతారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఉక్కు కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ప్రైవేటీకరణ చేసేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఇటువంటి ఆరోపణలు చేస్తూ నిరసనలకు దిగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఆర్ఐఎన్ఎల్ (RINL) జారీ చేసిన సర్క్యూలర్ చుట్టూ ప్రస్తుతం వివాదం తిరుగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కార్మికులు అందరికీ పూర్తి జీతాలు ఇచ్చినట్లు యాజమాన్యం పేర్కొందని కార్మికులు అంటున్నారు. అయితే నవంబర్ నుంచి మాత్రం అందుకు భిన్నంగా జీతాల చెల్లింపు ఉంటుందని యాజమాన్యం చెబుతోందంటున్నారు. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాల చెల్లింపు ఉంటుందని సర్క్యూలర్ లో పేర్కొందని కార్మికులు వాపోతున్నారు.
నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా వంద శాతం ఉత్పత్తి జరిగితేనే వంద శాతం జీతాలు ఇస్తామన్నట్లుగా యాజమాన్యం సర్క్యూలర్ ఉందని ఆరోపిస్తున్నారు. దాని వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ముడి పదార్థాలు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదని, తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దాని వల్ల లక్షిత ఉత్పత్తిని సాధించడం సాధ్యం కావడం లేదని అంటున్నారు. యాజమాన్యం రోజుకు 19000ల టన్నులను ఉత్పత్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హామీనిచ్చిందని గుర్తు చేస్తున్నారు. లక్ష్యం సాధించాలంటే ముడి పదార్థాలు కావాల్సినంత అందుబాటులో ఉండాలంటున్నారు. అంతేకాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటున్నారు.
ఉత్పత్తితో తమ జీతాలను ముడి పెట్టడం అన్యాయమంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే 14వేల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీ, 2వేల కోట్లకు పైగా మినహాయింపులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాంట్ కు ఇచ్చాయంటున్నారు. అయినప్పటికీ ఉత్పత్తికి తమ జీతాలతో ముడిపెడుతూ తమకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ నేడు నిరసనకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై సరైన నిర్ణయం తీసుకొని తమకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని కార్మికులు వ్యక్తం చేస్తున్నారు.






