- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: జూలో విషాదం.. మరో ‘టైగర్ కుమారి’ మృతి
విశాఖ జూలో జంతువుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సందర్శకులను అలరించిన జంతువులు ఇప్పుడు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జూలో జంతువుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సందర్శకులను అలరించిన జంతువులు ఇప్పుడు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా జీవించిన జంతువులు ఇప్పుడు మృత్యువాత పడుతున్నాయి. వరుసగా రెండు రోజుల్లోనే రెండు పులులు చనిపోవడం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేశాయి. ఎంతో గాంభీర్యంగా కనిపించే ఈ రెండు పులులు చాలా ఏళ్లుగా జూలో ఉన్నాయి. రెండు రోజులు క్రితం జానకి అనే పెద్దపులి చనిపోయింది. తాజాగా కుమారి అనే పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ రెండు పులల మరణాన్ని అధికారులు స్వయంగా ప్రకటించారు. జూలో మొత్తం మూడు పులులు ఉండేవని.. రెండింటి మరణంతో మరొకటి ఉందని జూ క్యూరేటర్ పేర్కొన్నారు.
Next Story






