- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MSME పార్క్ ప్రారంభోత్సవంలో ప్రమాదం.. మంత్రులకు తప్పిన ముప్పు!..
విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలం కృష్ణాపురంలో జరిగిన MSME సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలం కృష్ణాపురంలో జరిగిన MSME సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఫోటోలు తీయడానికి కార్యకర్తలు, స్థానికులు ఒక్కసారిగా వేదికపైకి రావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంత్రి, ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అంతకుముందు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసి 12 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో కృష్ణాపురంలో MSME పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ ప్రారంభోత్సవం గురించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఉత్తరాంధ్రలో మొట్టమొదటి MSME పార్క్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించాను. మొదటి దశలో 21.72 ఎకరాలలో 163 ప్లాట్లుగా విభజించాము. మౌలిక సదుపాయాల కోసం 12 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ఈ పార్క్ ప్రారంభమైతే వేలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, గంటా శ్రీనివాసరావు పాండ్రంగి వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.






