విశాఖపట్నం: చీటింగ్ కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్

by Thanuru Gopichand |

ఆన్లైన్ లో పెట్టుబడులు (Online Fraud) పెడితే అధిక లాభలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసుల విశాఖ వన్ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

విశాఖపట్నం: చీటింగ్ కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్లైన్ లో పెట్టుబడులు (Online Fraud) పెడితే అధిక లాభలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసుల విశాఖ వన్ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నంలో (Vishakapatnam) ఇటీవల భారీ ఆన్లైన్ పెట్టుబడి మోసం జరిగింది. అందులో నిందితులుగా రిటైర్డ్ రైల్వే టీటీఈ సదరం శివ, ఆయన కుమారుడు ప్రేమ్ సాగర్ ఉన్నారు. రమ్య రాజు అనే మహిళను వారు ఆన్లైన్ పెట్టుబడుల పేరిట నమ్మించారని పోలీసులు పేర్కొన్నారు. తద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారన్నారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ పెట్టుబడి పెట్టిందన్నారు. ఏకంగా కోటి 97 లక్షల రూపాయలను రమ్య రాజు అనే మహిళతో పెట్టుబడులు పెట్టించారని పేర్కొన్నారు. అయితే ఎంతకు లాభాలను అందివ్వకపోవడంతో తన అసలు మొత్తాన్ని ఇవ్వాలని సదరు మహిళ వారిని డిమాండ్ చేసిందన్నారు. ఈ క్రమంలో ఇంకొంత డబ్బు పెడితేనే పాత డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మించి, నిందితులు మరోసారి ఆమెను మోసానికి గురిచేశారని వివరించారు.

నిందితుల మాటలను పూర్తిగా నమ్మిన బాధితురాలు, ఇంట్లో ఉన్న 75 తులాల బంగారాన్ని సైతం తాకట్టు పెట్టిందన్నారు. ఆ డబ్బును కూడా వారి వద్ద పెట్టుబడిగా పెట్టిందని తెలియజేశారు. అయితే పలుమార్లు తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా రమ్య రాజు నిందితులను అడిగారన్నారు. ఈ క్రమంలో నిందితులైన సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారన్నారు. వారి తీరుతో ఖంగుతున్న బాధిత మహిళ తాను మోసపోయానని గ్రహించారు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, నిందితులపై కేసు నమోదైందన్నారు. సమగ్ర విచారణ అనంతరం రిటైర్డ్ రైల్వే టీటీఈ సదరం శివ, ఆయన కుమారుడు సదరం ప్రేమ్ సాగర్‌లను అరెస్ట్ చేశారని వెల్లడించారు. మోసానికి పాల్పడిన తండ్రీకొడుకులను న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ పోలీసులు తెలియజేశారు.

Next Story