ఇండియా కూటమి వైపు చంద్రబాబు: Vijayasai Reddy

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-13 16:13:30  IST  )

టీడీపీ అధినేత చంద్రబాబు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా‘ఇండియా’ కూటమికి దగ్గరవుతున్న సంగతి బీజేపీ అధిష్ఠానానికి తెలుసని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్​ చేశారు...

ఇండియా కూటమి వైపు చంద్రబాబు: Vijayasai Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా‘ఇండియా’ కూటమికి దగ్గరవుతున్న సంగతి బీజేపీ అధిష్ఠానానికి తెలుసని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్​ చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు చేసిన ప్రజాధనం లూటీని ఆధారాలతో సీఐడీ నిగ్గు తేల్చినట్లు పేర్కొన్నారు. ఆయన జీవితమంతా నేర, కుట్రపూరిత రాజకీయమేనని మండిపడ్డారు. బాబుపై ఉన్న కేసులన్నింటిలో శిక్షపడితే జీవితాంతం జైల్లోనే గడపాలన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగితే పురంధేశ్వరిలా అవినీతిపరులకు మద్దతు పలికేవారు కాదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story