- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)లో అగ్ని ప్రమాదం జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ-2(Coke Oven Battery-2)లో మంటలు చెలరేగాయి. వర్క్ నడుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు తేరుచుకునే లోపే మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదం నుంచి పలువురు కార్మికులు చాకచక్యంగా బయటపడ్డారు. కానీ శ్రీనివాస్ అనే కార్మికుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే చర్యలు చేపట్టింది.
కాగా స్టీల్ ప్లాంట్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరగుతుండటంతో కార్మికులు(Workers) ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ఓ అగ్ని ప్రమాదం జరిగిందని, అది మర్చిపోకముందే మరోసారి ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది వేసవి కాలం కావడంలో స్టీల్ ప్లాంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికులు అంటున్నారు. ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






