జగన్‌ను తీసుకురండి.. రాజయ్యపేట బాధితుల డిమాండ్

by Vemula.Srinu Prasad |

తమ గ్రామానికి వైఎస్ జగన్‌ను తీసుకురావాలని అనకాపల్లి జిల్లా రాజయ్యపేట బాధితులు డిమాండ్ చేశారు..

జగన్‌ను తీసుకురండి.. రాజయ్యపేట బాధితుల డిమాండ్
X

దిశ, వెడ్ డెస్క్: తమ గ్రామానికి వైఎస్ జగన్‌ను తీసుకురావాలని అనకాపల్లి జిల్లా రాజయ్యపేట బాధితులు డిమాండ్ చేశారు. స్థానికంగా బల్క్ డ్రగ్స్ పార్క్‌ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజయ్యపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి ఆందోళనలకు వైసీపీ నేతలు తాజాగా సంఘీభావం తెలిపారు. రాజయ్యపేటలో బాధితులను కలిసి నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటును తాము స్వాగతిస్తామని, కానీ ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) సూచించారు. బల్క్ డ్రగ్స్ పార్క్(Bulk Drugs Park) వస్తే తమ జీవితాలు నాశనమవుతాయంటూ రాజయపేట(Rajaypet)వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమ హయాంలో కూడా పరిశ్రమలు వచ్చాయని, ప్రజలను ఒప్పించి తాము ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అయితే వైఎస్ జగన్‌(Ys Jagan)ను రాజయ్యపేటకు తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జగన్‌తో చర్చించి తీసుకొస్తామని గ్రామస్తులకు బొత్స వివరించారు.

Next Story