- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Govt: లులూ మాల్‌తో ప్రభుత్వం కీలక ఎంవోయూ
విశాఖ సీఐఐ సదస్సు ద్వారా లులూ మాల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీఐఐ సదస్సు(Visakhapatnam CII Conference) ద్వారా లులూ మాల్(Lulu Mall)తో రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎంవోయూ చేసుకుంది. మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్(Mallavelli Food Processing Unit)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సమక్షంలో మాల్ సీఈవోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. అయితే లులూ మాల్‌పై ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లులూ మాల్ ద్వారా జరిగే గోమాంసం ఎగుమతులపై ఆయన మండిపడ్డారు. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ అతిగా షరతులు పెడుతుందని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే భూములు, రాయితీలు తీసుకుంటూ షరతులు పెట్టడం సరికాదన్నారు. గోవధ లాంటి పనులు చేస్తే అసలు ఒప్పుకోమని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే చర్చల అనంతరం ఎంవోయూలకు లులూ, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.






