- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల అవతారం ఎత్తి మోసాలు.. దంపతులకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హోంశాఖ
by Vemula.Srinu Prasad |
అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడిన భార్యభర్తలకు రాష్ట్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ఘటన విశాఖలో జరిగింది. ప్రభుత్వం టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్నే అనువుగా చేసుకుని దంపతులు భాగ్యరేఖ, చంద్రశేఖర్ మోసాలకు పాల్పడ్డారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడిన భార్యభర్తలకు రాష్ట్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ ఘటన విశాఖలో జరిగింది. ప్రభుత్వం టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్నే అనువుగా చేసుకుని దంపతులు భాగ్యరేఖ, చంద్రశేఖర్ మోసాలకు పాల్పడ్డారు. ఈమేరకు విచారణ జరిపిన హోంశాఖ టిడ్కో ఇళ్ల మంజూరు పేరుతో దంపతులిద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో వారికి చెందిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో 94 సెంట్ల భూమిని జప్తు చేసింది. విశాఖ మధురవాడలో 9.39 ఎకరాలను పర్యటకాభివృద్ధికి బదిలీ చేసింది. పర్యాటక భూమి కేటాయింపు విధానంతో ఈ భూమిని ప్రభుత్వం బదిలీ చేసింది. స్టార్ హోటల్, రిసార్టులు, ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ భూములను బదిలీ చేసింది.
Next Story






