Visakha: వైసీపీ మేనిఫెస్టో ఏమైంది: వంగలపూడి అనిత

by Disha Web Desk 16 |
Visakha: వైసీపీ మేనిఫెస్టో ఏమైంది: వంగలపూడి అనిత
X

దిశ, ఉత్తరాంధ్ర: వైసీపీ మేనిఫెస్టో ఏమైందని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు రాజమండ్రి మహానాడుకి ముందు ఆ తరవాతగా ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే సరికి 18 మంది మంత్రులు మాట్లాడుతున్నారని, 98.6 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దశలు వారిగా మద్యపాన నిషేధం ఎక్కడ అమలయిందో చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్, 45 ఏళ్లకే పెన్షన్, ఇంటికి ఇంటికి కుళాయి, సీపీఎస్ రద్ద హామీలపై ఆమె నిలదీశారు.

రోజాకు డప్పు కనిపించినా ఆగదు. స్టేజీ కనిపించినా ఆగదని అనిత విమర్శించారు. గంజాయి, డ్రగ్స్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. సంపాదించేవారికే అప్పు చేసే హక్కు ఉంటుందని, చంద్రబాబు నాయుడు 18 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు మూడు వేల రూపాయలు అందిస్తానన్నారు. మూడు సిలెండర్లు ఉచితంగా అందిస్తానని చెప్పారు. మహిళలు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అనిత విమర్శించారు.

Also Read..

Laxmi Parvathi: ఎన్టీఆర్ వారసుడు ఆయనేనంటూ కీలక వ్యాఖ్యలు



Next Story