రాష్ట్రంలో ఆర్టికల్ 355‌ను అమలు చేయండి: Kinjarapu Atchannaidu

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-11 16:31:13  IST  )

తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి రాష్ట్రంలో పలు అంశాలపై వివరించారు...

రాష్ట్రంలో ఆర్టికల్ 355‌ను అమలు చేయండి: Kinjarapu Atchannaidu
X

దిశ, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి రాష్ట్రంలో పలు అంశాలపై వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఆర్టికల్ 355‌ను అమలు చేయాలని కోరారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు మణిపూర్ తరహాలో ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో హత్యాకాండ కొనసాగుతుందని పలు అంశాలను తెలియజేశారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక ఎంపీ కుటుంబానికి భద్రత లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనను వివరించారు.

Next Story