- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: శారదాపీఠంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
by Vemula.Srinu Prasad |
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు....

X
దిశ, ఉత్తరాంధ్ర: తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెల 3న తాండూరులో తలపెడుతున్న రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని స్వరూపానందేంద్ర స్వామిని కోరారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. 21న చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేష్ బయలుదేరుతున్న నేపథ్యంలోస్వరూపానందేంద్ర స్వామి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
Next Story






