Vishaka Steel Plant కోసం తిరుమల యాత్ర

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-17 14:33:47  IST  )

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోమారు గర్జించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటూ ముగ్గురు విశాఖ ఉక్కు కార్మికులు కాలి నడకన తిరుమల బయల్దేరారు...

Vishaka Steel Plant కోసం తిరుమల యాత్ర
X

దిశ, ఉత్తరాంధ్ర: (అచ్చుతాపురం) విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోమారు గర్జించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటూ ముగ్గురు విశాఖ ఉక్కు కార్మికులు కాలి నడకన తిరుమల బయల్దేరారు. గతంలో నిర్వాసితుల కోసం ఆర్ నెంబర్లు ఇచ్చినప్పటికీ ఉపాధి మాత్రం చూపించ లేకపోయారంటూ ఈ సందర్బంగా వారు శనివారం మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటూ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో వీరు అచ్యుతాపురంలో కూడా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి ప్రసాదించాలని తిరుపతి వెంకన్నను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Next Story