మాజీ స్పీకర్ తమ్మినేనికి ఊరట.. అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-27 10:19:33  IST  )

వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఊరట లభించింది. భూ కబ్జా కేసులో ఆయనను తొదరపడి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. సీతారమ్‌తో పాటు ఆయన సతీమణి వాణికి 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించింది...

మాజీ స్పీకర్ తమ్మినేనికి ఊరట.. అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఊరట లభించింది. భూ కబ్జా కేసులో ఆయనను తొందరపడి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. సీతారామ్‌తో పాటు ఆయన సతీమణి వాణికి 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించింది. కాగా శ్రీకాకుళం సమీపంలోని చాపురం పంచాయతీ బలగ పరిధిలో రూ. 4 కోట్ల విలువైన భూమిని పోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు తమ్మినేని ఫ్యామిలీ ప్రయత్నం చేసింది. దీంతో ఆయన భార్య వాణి, కుమారుడు వెంకటశ్రీరామ చిరంజీవి నాగ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు నకిలీ పతక్రాలు సృష్టించి ఒడిశాకు చెందిన మహిళను వారసురాలిగా చూపుతూ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో తమ్మినేని కుటుంబంలో ముగ్గురు, ఓ మాజీ హోంగార్డు త్రినాథ్, హిరమండలం సబ్ రిజిస్ట్రార్‌ను నిందితులుగా గుర్తించి దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి తమ్మినేని ఫ్యామిలీ పరారైంది. తాజాగా కోర్టును ఆశ్రయించడంతో ఊరట కలిగింది.

Next Story