- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాంధ్ర భద్రాద్రిని దర్శించుకున్న నాగబాబు
ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామిని నాగ ఎమ్మెల్సీ నాగబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామిని నాగ ఎమ్మెల్సీ నాగబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నీలాచలం కొండ చుట్టూ నూతనంగా నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గం తన పర్యటనలో ప్రత్యేకంగా ఆకట్టుకుందని తెలిపారు. . గతంలో రాళ్లు, ముళ్లతో భక్తులు ఎంతో కష్టపడి ప్రదక్షిణలు చేసేవారని గుర్తు చేవారు. భక్తుల కష్టాలను గుర్తించి, రూ. 3.40 కోట్ల నిధులతో ఈ 3.70 కి.మీల సుందరమైన బీటీ రోడ్డును మంజూరు చేసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామాయణ, మహాభారత కాలాల నాటి చారిత్రక ఆనవాళ్లు ఉన్న ఈ దివ్యక్షేత్రం, రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా (Spiritual Tourism Destination) మారుతుందని నాగబాబు తెలిపారు.






