- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > విశాఖపట్నం > MLC Election Campaign: మా అభ్యర్థికి ఓటు వేయండి.. వధూవరులకు వైసీపీ విజ్ఞప్తి
MLC Election Campaign: మా అభ్యర్థికి ఓటు వేయండి.. వధూవరులకు వైసీపీ విజ్ఞప్తి
by Vemula.Srinu Prasad |
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రతినిధులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ..

X
దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రతినిధులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. విశాఖ 52వ వార్డు శాంతినగర్‌లో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఓ పెళ్లి పందిరిలో ఉన్న వధూవరులను కలిశారు. వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతమరాజు సుధాకర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. వధువుకు కరపత్రాలు అందజేశారు. కాగా ఈ నెల 13న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులకు వైసీపీ, టీడీపీ మద్దతు పలికాయి. వారి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
Next Story






