- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ.. టీడీపీ ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీదే విజయమని చెప్పారు. జగన్‌ను కలిసిన కార్పొరేటర్లు కూడా వాళ్ల పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో విశాఖలో భారీగా భూకుంభకోణాలు జరిగాయని, వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. దోచుకున్న భూముల సర్వే నెంబర్లతో సహా పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.
Next Story






