- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్యుతాపురం రోడ్డుకు మోక్షం.. 4 లైన్ల విస్తరణకు శ్రీకారం
అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి(Anakapalli) నుంచి అచ్యుతాపురం(Atchutapuram) వరకు సుమారు 14కి.మీ.ల పొడవైన రోడ్డు విస్తరణ(Road widening) పనులకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ రహదారి విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్ల ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎడిబి) ఆర్థికసాయంతో 4లైన్ల రహదారిగా విస్తరణ చేసేందుకు మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టారు. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్‌తోపాటు రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులు నిర్మించనున్నారు.
కాగా ఈ ప్రాంతం విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా ఉంది. ఇందులో భాగంగా రాంబిల్లి, అచ్యుతపురం, పరవాడ వద్ద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక సమూహాలకు దగ్గరగా ఉంది. దీంతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈరోడ్డు విస్తరణ చేపట్టాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ రహదారి APSEZ, 180 పరిశ్రమల చుట్టూ ఉన్న ఇతర కీలక పారిశ్రామిక ప్రాంతాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండల నివాసితులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.






