- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా దృష్టికి వచ్చింది.. వెంటనే పరిష్కరిస్తాం: నారా లోకేశ్ ట్వీట్
గురుకుల , కేవీబీపీ విద్యార్థుల సమస్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు....

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. దీంతో పలుచోట్ల తీవ్ర చలి తీవ్రంగా ఉంటుంది. అంతేకాకుండా మంచు కూడా కురుస్తోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) పాడేరు ఏజెన్సీ ప్రాంతం(Paderu Agency Area)లోని గురుకుల, KGBV విద్యార్థులు(Gurukul, KGBV students) సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలికి తట్టుకోలేకపోతున్నారు. పైగా హాస్టల్‌లో సరైన వసతులు లేవు. దీంతో విద్యార్థులు అవస్థలు మరింతమయ్యాయి. ఈ మేరకు విద్యార్థులు తమ సమస్యలను బయటకు చెప్పుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయం మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)కు తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. గురుకు విద్యార్థులు అవస్థలు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. పాడేరు ఏజెన్సీలో చదువుతున్న గురుకుల, కేజీబీవీ విద్యార్థులు ఈ శీతాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. చిన్నారులకు తగిన వసతులు కల్పించి వెంటనే సమస్యను పరిష్కరించాలని అల్లూరి జిల్లా కలెక్టర్‌ను మంత్రి లోకేశ్ ఆదేశించారు.






