మాకూ వ్యక్తిత్వం, అభిమానం ఉంది: Minister Botsa

by Vemula.Srinu Prasad |

వైసీపీలో అధికారం కొంతమంది చేతుల్లోనే ఉందని ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు..

మాకూ వ్యక్తిత్వం, అభిమానం ఉంది: Minister Botsa
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో అధికారం కొంతమంది చేతుల్లోనే ఉందని ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించిన వైసీపీ సమాజిక సాధికారిక బస్సు యాత్రలో ఆయన మాట్లాడారు. వైసీపీలో బీసీ మంత్రులమైన తమకు వ్యక్తిత్వం, ఆత్మభిమానం ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు హయాంలో బీసీ మంత్రులుగా చేసిన వారికంటే గౌరవంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ది నైతిక రాజకీయమా అని ప్రశ్నించారు. ఏపీ అప్పులపై స్పందించిన ఆయన పరిమితికి మించి చేయడంలేదని తెలిపారు. పరిమితులు దాటితే కేంద్రప్రభుత్వమే అప్పునకు నో చెబుతుందని చెప్పారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు నిందితుడని బొత్స వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రజల ముందుకు వచ్చామని బొత్స పేర్కొన్నారు.

Next Story