జనసేనపై పవన్‌ చేతులెత్తేశారు.. మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-12 14:46:54  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు వేశారు...

జనసేనపై పవన్‌ చేతులెత్తేశారు..   మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. జనసేన పార్టీని నడపలేనని పవన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. విశాఖలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ పవన్ పార్టీ జనసేన కాదని, అది జెండా సేన విమర్శించారు.ప్రతీ ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ జెండా మోయడమే పని అని వ్యాఖ్యానించారు. జనసైనికులు ఇక నుంచి జెండా కూలీలు అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ఇప్పుడు అదే నిజమైందని, తాము చెబితే చెప్పులు చూపించిన పవన్.. ఇప్పుడేం చూపిస్తారని చెప్పారు. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేయడం అంత ఈజీ కాదని విమర్శించారు. 30 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఎలా అవుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

బిగ్ న్యూస్: తెలంగాణలో జనసేన పొత్తు ఎవరితో.. సంచలనం రేపుతోన్న పవన్ తాజా ప్రకటన!

Next Story