బిగ్ న్యూస్: తెలంగాణలో జనసేన పొత్తు ఎవరితో.. సంచలనం రేపుతోన్న పవన్ తాజా ప్రకటన!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: తెలంగాణలో జనసేన పొత్తు ఎవరితో.. సంచలనం రేపుతోన్న పవన్ తాజా ప్రకటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రెండు ప్రాంతాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన తాజా ప్రకటన దుమారంగా మారింది. ఏపీలో జగన్ సర్కార్‌ను ఇంటికి పంపించేందుకు తప్పకుండా పొత్తులు పెట్టుకుంటామని.. పొత్తులకు అంగీకరించని పార్టీలను ఒప్పిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తిగా మారింది.

తెలంగాణ బీజేపీతో పవన్ పొత్తు:

ఏపీలో బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఇటీవలే ఆయన బీజేపీ పెద్దలను ఢిల్లీలో కలిసి వచ్చారు. అనంతరం తాజాగా పొత్తులపై ఈ రీతిలో ప్రకటన చేశారు. అయితే ఏపీలో కాషాయ పార్టీతో చేతులు కలిపిన జనసేనాని తెలంగాణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని పవన్ గతంలో తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపు కూడా ఇచ్చారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహిని కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహించి చర్చగా మారారు.

ఈ క్రమంలో ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోరాటం చేస్తుందని పవన్ చేసిన ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ జనసేన కార్యకర్తలకు బీజేపీ మద్దతు దారులు కీలక పిలుపునిస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దే దింపేందుకు బీజేపీతో చేతులు కలపాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ హిందువుగా రాజకీయాల్లోకి వస్తున్నారని తెలంగాణ జనసైనికులు నీళ్లలా మిగిలిపోకుండా కేసీఆర్ పై పోరాటంలో మాతో కలిసి రావాలని పోస్టులు చేస్తున్నారు. తమతో కలిసి వచ్చేందుకు స్థానిక డివిజన్ లేదా అసెంబ్లీ బీజేపీ నియోజకవర్గ నాయకులను సంప్రదించాలని పోస్టులు చేస్తున్నారు.

అయితే తెలంగాణలో ఇప్పటికే టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు జోరు పెంచింది. మరోవైపు కేసీఆర్ ను నిలువరించేందుకు బీజేపీ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి:

Janasena టెంట్ హౌస్ పార్టీ... పవన్‌కు పేర్ని నాని కౌంటర్

Nadendla Manohar: పవన్ ఆశయాలకు వారే వారధులు



Next Story

Most Viewed