Janasena టెంట్ హౌస్ పార్టీ... పవన్‌కు పేర్ని నాని కౌంటర్

by Disha Web Desk 16 |
Janasena టెంట్ హౌస్ పార్టీ... పవన్‌కు పేర్ని నాని కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన టెంట్ హౌస్ పార్టీ అని మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన పార్టీ అని విమర్శలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 2014లో పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో తనకు బలం లేదని పవన్ కల్యాణ్‌కు తెలుసునని చెప్పారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని పవన్ కల్యాణ్ గుర్తించారన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పోటీ చేశారని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించారని ఆరోపించారు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని పవన్ కల్యాణ్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారని, ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని అన్నారు. బలం లేని పవన్ కల్యాణ్ వైసీపీని ఓడించడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు.

ఇవి కూడా చదవండి:

MP Raghurama Case: ఆ కాల్‌ డేటా భద్రపర్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Next Story

Most Viewed