- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్.. మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు
పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ తప్ప రాష్ట్రం మీద, ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదని మంత్రి అమర్‌నాథ్ అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ తప్ప రాష్ట్రం మీద, ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యనేతలతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ ఏపీలో లోకల్స్, నాన్‌లోకల్స్ మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వాళ్లకు సమర్థించే వాళ్లంతా నాన్‌లోకల్సేనన్నారు. పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా..? అని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు అక్కడి వెళ్లారో చెప్పాలన్నారు. అమరావతిలో భూముల విలువలు ఎక్కడ కోల్పోతామోనని విశాఖ రాజధాని అంశంపై విషం కక్కుతున్నారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు.
Next Story






