Visakha: జనసైనికులను ఘోరంగా అవమానించిన మంత్రి అమర్‌నాథ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-14 13:15:02  IST  )

జన సైనికులను జెండా కూలీలుగా పవన్ కళ్యాణ్ మార్చేశాడని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ...

Visakha: జనసైనికులను ఘోరంగా అవమానించిన మంత్రి అమర్‌నాథ్
X

దిశ, ఉత్తరాంధ్ర: జన సైనికులను జెండా కూలీలుగా పవన్ కళ్యాణ్ మార్చేశాడని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని పొలిటికల్ టూరిస్టర్ అని విమర్శించారు. 2024 ఎన్నికలకు సంబంధించి తన మనసులో భావాలను బయటపెట్టారని తెలిపారు. సింగిల్‌గా పోటీలో నెగ్గలేనని, ఈసారి టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

2024లో ఓటమిపాలయ్యే టీడీపీతో పాటు తన ఓటమి కూడా టీడీపీపై నెట్టేయడానికి ఇది ఒక పథకమని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి మరోసారి చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని జనసైనికులకు సింగిల్‌గా పోటీకి వెళ్లకుండా మరోసారి జెండా కూలీలుగానే పవన్ మార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు.

Read more:

AP Politics: ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవి?

Next Story