దుర్గాదేవి ఆలయంలో చోరీ.. భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-02 12:18:05  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక దుర్గాదేవి ఆలయమే లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ప్రధాన ద్వారం తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు....

దుర్గాదేవి ఆలయంలో చోరీ.. భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) పాడేరులో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. స్థానిక దుర్గాదేవి ఆలయమే(Durga Devi Temple) లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ప్రధాన ద్వారం తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భాలయంలోని అమ్మవారికి అలంకరించిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారు(Gold), వెండి(Silver) ఆభరణాలను దొంగిలించారు. తలుపులు విరిగి ఉండటం చూసి అర్చకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story