అనకాపల్లి అంటే కోడి గుడ్డు గుర్తుకోస్తోంది.. మంత్రి అమర్‌నాథ్‌పై పవన్ సెటైర్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-07 15:14:16  IST  )

అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని.. ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ...

అనకాపల్లి అంటే కోడి గుడ్డు గుర్తుకోస్తోంది.. మంత్రి అమర్‌నాథ్‌పై పవన్ సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని.. ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్‌లో వారాహి విజయభేరి యాత్ర చేపట్టారు. ఉమ్మడి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అమర్‌నాథ్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. తుమ్మపల్లి షుగర్ ఫ్యాకరీని తెరిపిస్తామని చెప్పి అమ్ముతున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని మండిపడ్దారు. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని, ఇసుక దోపిడీదారుడు అని పవన్ కల్యాణ్ విమర్శించారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరమన్నారు. మంత్రి పదవులు కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేవని.. కానీ తాను రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More..

ఆ ఇంటి రెంట్ ఒక్క రూపాయి! ఆ ఇంట్లో ఉంటున్న పవన్ కళ్యాణ్..ఎందుకంటే?

Next Story