Visakha: రోజులు దగ్గర పడ్డాయి.. సీఎం జగన్ పాలనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-27 16:15:27  IST  )

ఏపీ ప్రభుత్వ పాలనపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు...

Visakha: రోజులు దగ్గర పడ్డాయి.. సీఎం జగన్ పాలనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ పాలనపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి జనసేన శ్రేణులతో ఆయన వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విభజించు, పాలించు వ్యూహాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి విధ్వంసకర పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. జనసేన బలోపేతం కోసం జననసైనికులందరూ కలిసి పని చేయాలని నాగబాబు పిలుపు నిచ్చారు.

Next Story