అనకాపల్లిలో రైతులపైకి ఎగబడ్డ భారీ పాము... వీడియో వైరల్

by velandi.Saikiran |

అనకాపల్లి జిల్లాలో ( Anakapalle District) భారీ పాము (Snake) కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా

అనకాపల్లిలో రైతులపైకి ఎగబడ్డ భారీ పాము... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లాలో ( Anakapalle District) భారీ పాము (Snake) కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లాలోని దేవర పల్లిలో ( Devara pally) ఏకంగా 15 అడుగుల భారీ పాము... పొలాల్లోకి చొరబడింది. దీంతో.. అక్కడే ఉన్న రైతులు ( Farmers) గజగజ వణికిపోయారు. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ పాము... అక్కడే ఉన్న రైతులను... పరుగులు పెట్టించింది. అయితే పొలాల్లో కుక్కలు ( Dogs) అడ్డుకోవడంతో.... రైతులపైకి ఆ పాము దూసుకు వచ్చింది.

అయితే 15 అడుగుల భారీ పాము తమ పైకి రావడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు రైతులు కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే రైతులపైకి పాము దూసుకు వచ్చిన వీడియో... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అటు ఈ వీడియోని చూసిన నెటిజెన్స్... షాక్ అవుతున్నారు. ఏంటి పాము ఇంతలా ఉంది? 15 అడుగులు ఉంటుందా? అని కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ పాము ఏ జాతికి చెందింది? పామును ఏమని పిలుస్తారు ? అని కూడా సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. అయితే సోషల్ మీడియాలో ఇలా పాముల వీడియోలు రావడం చాలా కామన్. అనకాపల్లి ఫారెస్ట్ ఏరియాకు దగ్గరే ఉంటుంది కాబట్టి... పెద్దపెద్ద పాములు కూడా వస్తూ ఉంటాయి.

Next Story