- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ.. గంటా శ్రీనివాస్ కు కొత్త సమస్య !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP) ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ ( Ganta Srinivas)....

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP) ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ ( Ganta Srinivas).... సంచలన ట్వీట్ చేశారు. విశాఖ ( Visakha) నుంచి విజయవాడకు ( Vijawada) విమానంలో వెళ్లాలంటే సరైన సదుపాయాలు లేవని... సోషల్ మీడియా వేదికగా తనకు అనుభవమైన పరిస్థితిని పేర్కొన్నారు. ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ (Telangana) అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు గంటా శ్రీనివాస్.
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి.. పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఇవాళ.. సీఎం చంద్రబాబు నాయుడుతో అమరావతిలో సమావేశం అయ్యేందుకు... ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి... హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు చేరానని తెలిపారు.
అక్కడ దిగిన తర్వాత విజయవాడ విమానం క్యాచ్ చేసుకొని... గన్నవరం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని వివరించారు. తనతో పాటు అధికారులు కూడా ఇదే పద్ధతిలో అమరావతి చేరుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు కావడంతో ఈ పరిస్థితి నెలకొందని... మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లను ( Rammohan Naidu) సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ ఈ సమస్యను వివరించాడు. విశాఖ విమాన ప్రయాణికుల సమస్యను... తీర్చాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I






