- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరాగాంధీ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు
by Vemula.Srinu Prasad |
తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇందిరాగాంధీనేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi)కి కారణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(Former Vice President M. Venkaiah Naidu) తెలిపారు. విశాఖ సంక్రాంతి ఉత్సవాల్లో(Visakha Sankranti celebrations) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్న సమయంలో చాలా పోరాటాలు చేశానని చెప్పారు. పోలీసులు తనను అరెస్ట్ కూడా చేశారని, జైలుకు సైతం పంపించారని గుర్తు చేశారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినని చెప్పారు. విశాఖపై తనకు చాలా ప్రేమ ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని, భారతీయ వంటలు అందరూ తినాలని పిలుపునిచ్చారు.
Next Story






