- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: జనసేన, టీడీపీ పొత్తు.. గెలిచే సీట్లపై జోస్యం చెప్పిన గంటా శ్రీనివాసరావు
టీడీపీ-జనసేన కలయిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ..

దిశ, విశాఖపట్నం: టీడీపీ-జనసేన కలయిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఏపీ రాజకీయాల్లో మరిచిపోలేని రోజు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు భేటీ తరువాత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఇంత కాలం ప్రజల్లో అభిమానులు ఉన్న అనుమానాలు సందేహలు పటాపంచలు అయ్యాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్ననని తెలిపారు. పవన్ ప్రకటన వైసీపీకీ చమరగీతం పలకడానికి నాందిగా అభిమానించారు. బీజేపీ కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరచకాలు సైతం బీజేపీ గమనిస్తుందని తెలిపారు. వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేకంగా ఉందని, అమిత్ షా, నడ్డా సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారని గుర్తు చేశారు. ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు కలయికతో 160 సీట్లు వస్తాయని నమ్మకం ఉందన్నారు. జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.






