- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ కోర్టుకు మాజీ మంత్రి అమర్‌నాథ్... అనుచరుల్లో టెన్షన్
రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో నమోదు అయిన కేసులో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ..

దిశ, వెబ్ డెస్క్: రైల్వే జోన్ సాధన కోసం గతంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కింది కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన పైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన, చట్టపరంగానే తన పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు.
అక్రమంగా కేసు పెట్టారు
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అప్పట్లో ఇటువంటి అక్రమ కేసులు పెట్టారని అమర్‌నాథ్ విమర్శించారు. ఇలాంటి కేసులకు తాను భయపడబోనని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కోసం చేసిన ఉద్యమాలను అణచివేయలేరని, చట్టబద్ధంగానే అన్నింటినీ ఎదుర్కొని విజయం సాధిస్తానని మాజీ మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.






