Tcs, Infosys తీసుకొచ్చిన ఘనత జగన్‌దే: మాజీ మంత్రి అమర్‌నాథ్

by Vemula.Srinu Prasad |

విశాఖకు Tcs, Infosys తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అమర్‌నాథ్ అన్నారు...

Tcs, Infosys తీసుకొచ్చిన ఘనత జగన్‌దే: మాజీ మంత్రి అమర్‌నాథ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)కు Tcs, Infosys తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్‌(Former Cm Jagan)దేనని మాజీ మంత్రి అమర్‌నాథ్(Former Minister Amarnath) అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌ను కూటమి ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కంటిన్యూ ప్రాసెస్ అని అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ రావడం వల్లే విశాఖకు ఐటీ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. 2014లో విశాఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. తక్కువ రేటుకు పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వొచ్చని, కాని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం తప్పు అని చెప్పారు. ప్రభుత్వ ధనంతో లోకేశ్ ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. యాడ్స్ లో పరిశ్రమల శాఖ మంత్రి ఫొటో కూడా వేయడంలేదన్నారు. విశాఖను రాజధానిని చేస్తానంటే మునిగిపోతుందని, అదే చంద్రబాబు అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ అని నాడు జగన్ చెప్పారని, ఇప్పుడు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సైతం చెబుతున్నారని మాజీ మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు.

Next Story