గాజువాక ఘటన బాధాకరం: జగన్‌

by Vemula.Srinu Prasad |

గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరమని మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయిన ఘటనపై ఆయన స్పందించారు...

గాజువాక ఘటన బాధాకరం: జగన్‌
X

దిశ, వెబ్ డెస్క్: గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరమని మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయిన ఘటనపై ఆయన స్పందించారు. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జగన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏడుగురు ప్రమాధ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వైయస్‌ జగన్‌ ప్రార్థించారు.

Next Story