నేనంటే ఇష్టపడే పార్టీ నుంచే విశాఖ ఎంపీ బరిలోకి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

by Javid Pasha |
నేనంటే ఇష్టపడే పార్టీ నుంచే విశాఖ ఎంపీ బరిలోకి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
X

దిశ, ఉత్తరాంధ్ర: ఏదైనా రాజకీయ పార్టీ తన ఆలోచనా విధానం నచ్చి వస్తే వారితో చర్చించి ఆపార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీకి సిద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాకపోతే.. మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖ అభివృద్దికి తనవంతుగా పాటు పడతానన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా తన పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తున్నట్లు జేడీ లక్ష్మీనారాయణ మరోసారి స్పష్టం చేశారు.

Next Story