- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్: ఏపీ మాజీ మంత్రి అమర్‌నాథ్
బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్ అన ఏపీ మాజీ మంత్రి అమర్‌నాథ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉమ్మడి పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర సీఎం చంద్రబాబు గతంలో ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ కేసీఆర్ సెటైర్లు వేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్లపైనా ఆయన ఛలోక్తులు విసిరారు.
అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి అమర్‌నాథ్ ఏకీభవించారు. వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నట్లు మీడియా ముఖంగానే ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలు 100 శాతం కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. పబ్లిసిటి, మార్కెంటింగ్, ప్రతిపక్షాలపై అన్యాయంగా కేసులు పెట్టడం వంటివి తప్ప చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో ఏ ఒక్క చిన్న తప్పు కూడా లేదనని వెల్లడించారు. ప్రతిపక్షాలను అణగతొక్కడం తప్ప, తనపై మితిమీరిన ప్రచారం చేసుకోవడం తప్ప, చంద్రబాబు చేస్తున్నది ఏమీ లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు.






