- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో అగ్నిప్రమాదం.. ఓ ఫ్లాట్ లో చెలరేగిన మంటలు
విశాఖపట్నంలో (Vishakapatnam) తెల్లవారుజామున ఓ ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటన విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో (Vishakapatnam) తెల్లవారుజామున ఓ ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటన విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో జరిగింది. బీచ్ రోడ్డులోని రాధా బీచ్ లో ఉన్న ఫార్చూన్ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు అపార్ట్మెంట్ నుంచి వెలుపలికి వెల్లువెత్తాయి. ఈ హఠాత్మరిణామంతో అపార్ట్మెంట్ వాసులు బెంబేలెత్తిపోయారు. నిప్పులు గక్కుతున్న మంటలను చూస భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్క పెట్టున తమ ఇండ్లను వదిలి అపార్ట్మెంట్ కిందకు చేరుకున్నారు. అపార్ట్మెంటులోని ఇరుగు పొరుగు ఫ్లాట్ల వాసులు తమ ఫ్లాట్లకు కూడా ఎక్కడ మంటలు అంటుకుంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో వాటిని ఆర్పే పరిస్థితి లేకపోవడంతో అక్కడ నుంచి దూరంగా వచ్చేశారు. ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా అపార్ట్మెంట్ వద్దకు తరలివచ్చారు. అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న వెంటనే మంటల వ్యాప్తిని అంచనా వేసుకున్నారు. వాటిని ఆర్పడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అంచనాకు వచ్చారు. మరింత నష్టం వాటిల్లక ముందే మంటలను ఆర్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలను చేపట్టారు. మంటలు తొమ్మిదో అంతస్తులోని ఫ్లాట్ల చెలరేగడంతో కష్టపడి వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులందరిని సురక్షితమైన చోట ఉంచి మంటలను ఆర్పుతున్నారు. అపార్ట్మెంట్ యాభై శాతం దగ్ధమైందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తూ ఘటనపై విచారణను చేపట్టారు. ఈ హఠాత్పరిణామంతో విశాఖ వాసులు షాక్ కు గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, నేరాలు, అగ్ని ప్రమాదాల పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.






