- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: కైలాసగిరి కొండపై ప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు
విశాఖ కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కైలాసగిరి కొండ(Visakhapatnam, Kailasagiri Hill)పై అనూహ్య ఘటన జరిగింది. రోప్ వే(rope way) సమీపంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం(Fire Hazard) జరిగింది. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. కొండపైనున్న చెట్లకు సైతం మంటలు అంటుకున్నాయి. వెంటనే సెగలు, పొగలు కొండపై అలుముకున్నాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. కొండ పై నుంచి కిందకు పరుగులు తీశారు.
అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వీఎంఆర్డీఏ(VMRDA) చైర్మన్ ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేసవీ కాలం ప్రారంభంకానుండటంతో అప్రమత్తంగా ఉండాలని, అలాగే అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే మంటలార్పేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటకులు అంటున్నారు. అంతేకాదు పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.






