- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్డియాలజీ విభాగం స్వల్పంగా మంటలు చెలరేగినట్లు (Fire Accident) తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలంటుకున్న కార్డియాలజీ విభాగం వైపు వెళ్లారు. మంటలు విస్తరించకుండా తగిన చర్యలను చేపట్టారు. మంటలను ఆర్పేసి ప్రమాదాన్ని నివారించారు. హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, పేషంట్లను ప్రమాద స్థలం నుంచి దూరంగా సురక్షితంగా ఉండే చోటకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. టేబుళ్లు, కంప్యూటర్లు దగ్ధమైనట్లు హాస్పిటల్ సిబ్బంది పేర్కొంది. దీనిపై హాస్పిటల్ సూపరింటిండెంట్ స్పందిస్తూ ఘటనపై విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది జూన్ మాసంలో..
విశాఖపట్నం కేజీహెచ్ లో గతేడాది జూన్ లో కూడా అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కేజీహెచ్ లోని వెంటిలేటర్ యంత్రంలో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వార్డు అంతటా దట్టమైన పొగ కమ్మేయడంలో అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వార్డులోని సిబ్బందిని వేరే వార్డులకు హుటాహుటిన తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని నాటి సూపరింటిండెంట్ శివానంద్ తెలిపారు.






