పండగలో వ్యక్తిని కొట్టిన అయ్యన్న.. రాజకీయం చేయవద్దంటూ బాధితుడు రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-03 11:27:24  IST  )

నర్సీపట్నం పండగలో జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని ఎత్తుల భాస్కరరావు అన్నారు. పండగలో డప్పు కొడుతుండగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయిచేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు...

పండగలో వ్యక్తిని కొట్టిన అయ్యన్న.. రాజకీయం చేయవద్దంటూ బాధితుడు రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నర్సీపట్నం పండగ(Narsipatnam Festival)లో జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని ఎత్తుల భాస్కరరావు(Bhaskara Rao) అన్నారు. పండగలో డప్పు కొడుతుండగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) చేయిచేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. దళితుడు అని తన పేరు చెప్పి వైసీపీ(Ycp) రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తన చిన్నప్పటి నుంచి తాము అయ్యన్నపాత్రుడు వద్దే ఒకే కుటుంబంగా ఉంటున్నామని తెలిపారు. జాతరను అయ్యన్నపాత్రుడు చాలా గొప్పగా జరిపించారన్నారు. అందరూ జాతర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పారు. ఆ జాతరను రాజకీయం చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. తన వల్ల అయ్యన్న పాత్రుడి కాలుకి దెబ్బ తగిలిందని, ఈ నేపథ్యంలోనే తనపై చేయిచేసుకున్నారని ఎత్తుల భాస్కర్ రావు చెప్పారు.

భాస్కర్ రావు వీడియో

Next Story