- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనావాసాల్లోకి ఎలుగుబంటి.. ఒక్కసారిగా భయాందోళనలు
అల్లూరి సీతారామరాజు జిల్లా కడుతులలో ఎలుగుబంటి కనిపించడంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) కడుతులలో ఎలుగుబంటి(Bear) కనిపించడంతో ఉపాధి హామీ కూలీలు(Employment Guaranteed Workers) తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉపాధి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో గ్రామ యువకులతో కలిసి అటవీ ప్రాంతం వైపు ఎలుగుబంటిని తరమేందుకు ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో వారిపైకి దూసుకురావడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూలీలు పరుగులు తీశారు.
రక్షణ కల్పించండి..
ఈఘటనతో గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిరంతరం పొలాలకు, పనులకు వెళ్లే తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆ ఎలుగుబంటిని పట్టుకుని సురక్షితంగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని కోరారు, తమ గ్రామానికి వన్యప్రాణుల ముప్పు తప్పించాలని వేడుకుంటున్నారు.






