- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: వుడా మాజీ ఉన్నతాధికారి ప్రదీప్ కుమార్ ఆస్తుల అటాచ్
వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్ కుమార్‌కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు(Assets) కలిగివున్న వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్ కుమార్(VUDA Former Additional Chief Urban Planner P. Pradeep Kumar)కు ఈడీ(Enforcement) బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్(Hyderabad)లోని రూ. 1.9 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. ప్రదీప్ కుమార్‌తో పాటు ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలను సైతం జప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు వారిపేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్లను సైతం ఎటాచ్ చేసినట్లు పేర్కొన్నారు.
కాగా 2018లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ, ఒంగోలు, అనంతపురం, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.40 కోట్ల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సమయంలో వుడా అదనపు చీఫ్ అర్బన్ ప్లాన్ పి. ప్రదీప్ కుమార్ సైతం అధికారులకు చిక్కారు. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినటలు తేలింది. దీంతో అప్పటి నుంచి ఈడీ దర్యాప్తు చేసింది. ఇన్నాళ్టికి ప్రదీప్ కుమార్ ఆస్తులు ఎటాచ్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.






