దిశ కథనం ఎఫెక్ట్.. ఖమ్మం హెడ్‌క్వార్టర్‌కు ఇద్దరు హోంగార్డుల బదిలీ

by Kodari Anjali |

కారేపల్లి మండలంలో దాదాపు 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హోంగార్డులపై ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా సీపీ సునీల్ దత్ స్పందించారు.

దిశ కథనం ఎఫెక్ట్.. ఖమ్మం హెడ్‌క్వార్టర్‌కు ఇద్దరు హోంగార్డుల బదిలీ
X

దిశ, కారేపల్లి: కారేపల్లి మండలంలో దాదాపు 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హోంగార్డులపై ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా సీపీ సునీల్ దత్ స్పందించారు. ఒకరు చీటీల వ్యాపారం, మరొకరు బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వెలువడిన కథనాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం సెలవులో ఉన్న హోంగార్డ్ నారాయణఈ నెల 20 వరకు సెలవులు కొనసాగించనున్నాడు. అనంతరం ఈ నెల 21న ఖమ్మం హెడ్‌క్వార్టర్‌లో విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. మరో హోంగార్డ్ శంకర్‌ను కారేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఖమ్మం హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. ఈ విషయమై హోంగార్డుల ఆర్‌.ఐ సురేష్‌‌ను వివరణ కోరగా.. జిల్లా సీపీ ఆదేశాల మేరకు శంకర్‌ను హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం సెలవులో ఉన్న నారాయణకు కూడా ఈ నెల 21న హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల సూచనల మేరకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. వీరిద్దరిపై సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Next Story