రాష్ట్రపతికి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

by Ramesh Naini |

విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు.

రాష్ట్రపతికి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. వీరితోపాటు ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాస్‌ తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. విశాఖ తీరంలో బుధవారం అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం 10:00 గంటలకు రాష్ట్రపతి హాజరుకానున్నారు.

బుధవారం మధ్యాహ్నం తర్వాత రాష్ట్రపతి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వనున్నట్లు షెడ్యూల్లో అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో ఐఎఫ్‌ఆర్‌ సందర్భంగా నౌకాదళం ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహిస్తున్నారు. 18న ఫుల్‌డ్రెస్‌ రిహార్సల్స్, 19న మిలాన్‌, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌, 20న ఐయాన్‌ కానైవ్‌ ఆఫ్‌ చీఫ్స్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళుతున్నారు.

Next Story