- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Danger Bells : వాయు కాలుష్య కోరల్లోకి విశాఖ!!
సుందరమైన సముద్ర తీరంలో వెలిసి విశాఖపట్నం (Visakapatnam) వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందా? పట్టణాన్ని కాలుష్యం (Pollution) కమ్మేస్తోందా? నానాటికీ పెరుగుతున్న కాలుష్యం ప్రజారోగ్యం ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం విశాఖవాసుల మెదళ్లను తొలుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సుందరమైన సముద్ర తీరంలో వెలిసి విశాఖపట్నం (Visakapatnam) వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందా? పట్టణాన్ని కాలుష్యం (Pollution) కమ్మేస్తోందా? నానాటికీ పెరుగుతున్న కాలుష్యం ప్రజారోగ్యం ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం విశాఖవాసుల మెదళ్లను తొలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలకు ఏ మాత్రం తీసిపోను వసతులు విశాఖ సొంతం. పోర్టులు, అందమైన కొండలు, ప్రముఖ దేవాలయాలు, ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాలు విశాఖలో ఉన్నాయి. అయితే ఇటీవల నమోదవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) విశాఖవాసులను కలవరపరుస్తోంది. 2016లో సగటున 103గా ఉన్న ఏక్యూఐ ఈ ఏడాది డిసెంబరు నాటికి దాదాపు 239 ఏక్యూఐకు చేరుకుంది. ప్రస్తుతం 190 వరకు నమోదువుతూ ఆందోళన కలిగిస్తోంది.
కాలుష్యంతో శ్వాసకోస సమస్యలు
వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోస సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, పెద్దలు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. సున్నితమైన శ్వాసకోస వ్యవస్థ ఉన్నవారు మరింత అవస్థలు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావొచ్చని, గొంతులో దురద వంటివి కలగవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మరికొందరికి చర్మ సంబంధిత వ్యాధులకు దారి తీయవచ్చని చెబుతున్నారు.
గణనీయంగా పెరిగిన వాయు కాలుష్యం
2016లో సగటున 103గా ఉన్న ఏక్యూఐ 2025 డిసెంబర్ నాటికి 239కి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2020 నాటికి 95కి ఏక్యూఐ తగ్గిందని గుర్తు చేస్తున్నారు. అది అది కోవిడ్ లాక్ డౌన్ కారణంగా అని చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమల మూసివేత, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ఏక్యూఐ 95కి తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం ఏక్యూఐ సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలదే కాదు.. ప్రజల బాధ్యత కూడా
పరిశ్రమల కాలుష్యానికి తోడు.. వాహనాల కాలుష్యం కూడా నానాటికీ పెరుగుతోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాహనాల వల్ల వాయు కాలుష్యానికి ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు. పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని.. అయితే ప్రజలు కూడా కాలుష్య నియంత్రణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. వీలైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించాలని, కార్ పూలింగ్ వంటి వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలని, తమ నివాస ప్రాంతాల్లో చెట్లను సంరక్షించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఏసీల వినియోగం తగ్గించేందుకు చూడాలని కోరుతున్నారు. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం పౌరుల నుంచి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.






